
హైదరాబాద్, 20 నవంబర్ (హి.స.) రాష్ట్రంలోని చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు రుణమాఫీ కోసం రూ.33 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత జౌళి శాఖకు నిధులు విడుదల చేయడం పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చేనేత కార్మికులపై ఉన్న అప్పులను తీర్చేందుకు తాజాగా విడుదలైన పూర్తి నిధులను వినియోగించనున్నారు. హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్, అప్పారెల్ ఎక్స్పోర్ట్ పార్క్స్ కమిషనర్కు నిధులపై పూర్తి అధికారాలు ఇచ్చి లబ్ధిదారుల రుణమాఫీని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసే వెసులుబాటును కల్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు