
హైదరాబాద్, 20 నవంబర్ (హి.స.)
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫార్ములా ఈ-కార్ రేసు నిర్వహణలో రూ.55 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయన్న కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసుకునేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు సెప్టెంబర్ 9న రాజ్భవన్కు ఏసీబీ ఫైలు పంపగా, రాష్ట్రపతి కార్యాలయం నుంచి న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం గవర్నర్ గురువారం ఉదయం కేటీఆర్పై విచారణకు అనుమతినిస్తున్నట్లుగా ఫైలుపై సంతకం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు