
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 20 నవంబర్ (హి.స.)
భారత్-అమెరికాల మధ్య కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది. దీని కింద (India-US Defence Deal) 93 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను భారత్‌కు విక్రయించేందుకు అగ్రరాజ్యం ఆమోదించింది. దీంతో అధునాతన జావెలిన్ క్షిపణి (Javelin Missiles) వ్యవస్థ మన దేశానికి అందనుంది. రష్యాతో పోరులో ఉక్రెయిన్‌కు ‘దేవదూత’లా వచ్చిన ఈ ఆయుధానికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ ఉంది. భుజం మీద నుంచి గురిపెట్టి ప్రయోగించే ఈ మిసైల్.. కొన్ని వందల సంఖ్యలో రష్యన్ ట్యాంకులను పేల్చేసింది.
జావెలిన్ (Javelin Missiles).. ట్యాంక్ విధ్వంసకర క్షిపణి (ఏటీజీఎం-యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్). దీనిని భుజంపై నుంచి శత్రు ట్యాంకుల పైకి గురిపెట్టి ప్రయోగించవచ్చు. దీనిలో 3.7 అడుగుల క్షిపణి, డిస్పోజబుల్ లాంఛ్ ట్యూబ్, కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. వాస్తవానికి ట్యాంక్ విధ్వంసకర ఆయుధాన్ని ప్రయోగించిన ప్రదేశం నుంచి పొగ, వేడి వెలువడతాయి. ప్రత్యర్థులు హీట్ సెన్సర్లతో వాటిని గుర్తిస్తారు. కానీ, జావెలిన్‌లో తొలుత ట్యూబ్ నుంచి ఓ మోటర్ క్షిపణిని బయటకు కొంతదూరం విసురుతుంది. ఆ తర్వాత క్షిపణి మోటార్ పనిచేయడం మొదలుపెట్టి లక్ష్యం వైపు దూసుకెళుతుంది. దీనిని కంప్యూటర్‌తో నియంత్రిస్తారు. దీంతో కచ్చితంగా జావెలిన్‌ను ఎక్కడినుంచి ప్రయోగించారో శత్రువుకు అర్థం కాదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ