
రాజన్న సిరిసిల్ల, 20 నవంబర్ (హి.స.)
పాలనా పరమైన వ్యవహారాలకు
సంబంధించి వేములవాడ రాజన్న ఆలయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు ఆలయ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మొత్తం 17 మంది ఉద్యోగులను అంతర్గతంగా బదిలీ చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో ఇద్దరు ఏఈవోలు, నలుగురు సూపరింటెండెంట్లు, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఏడుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఒకరు రికార్డ్ అసిస్టెంట్, ఒకరు అటెండర్ ఉన్నారు. అయితే, ప్రసాదం గోదాంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటప్రసాద్ రాజును అంతర్గత బదిలీతోనే సరిపెట్టడంతో విషయం హాట్ టాపిక్గా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు