
చిత్తూరు, 20 నవంబర్ (హి.స.)
, :కుప్పం నియోజకవర్గ ప్రజలకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ భవన్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. కుప్పంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం శాంతిపురంలోని తన నివాసంలో నారా భువనేశ్వరి గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక ప్రజల నుంచి అర్జీలను ఆమె స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో నారా భువనేశ్వరిని కలిశారు. స్వచ్ఛ భారత్ అవార్డులు గెలుచుకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులను ఆమె అభినందించారు. దయాళ్ శ్రవణ్ ఫౌండేషన్ స్పాన్సర్ చేసిన వినికిడి పరికరాలను పంపిణీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ