
హైదరాబాద్, 20 నవంబర్ (హి.స.)
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నాంపల్లిలోని సీబీఐ స్పెషల్ కోర్టుకు విచారణ నిమిత్తం హాజరయ్యారు. ముందుగా గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు వచ్చిన ఆయన నేరుగా అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు చేరుకున్నారు. ఈ కేసులో 2013 సెప్టెంబరు నుంచి జగన్ మధ్యంతర బెయిల్పై ఉన్న విషయం తెలిసిందే. కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ చేసిన అభ్యర్థనను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సీబీఐ స్పష్టం చేసింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు