ఢిల్లీ బ్లాస్ట్ ఎఫెక్ట్.. అల్-ఫలాహ్ సంస్థ అధినేత ఇల్లు కూల్చివేతకు నోటీస్
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{} ఢిల్లీ 21నవంబర్ (హి.స
ఢిల్లీ బ్లాస్ట్ ఎఫెక్ట్.. అల్-ఫలాహ్ సంస్థ అధినేత ఇల్లు కూల్చివేతకు నోటీస్


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ 21నవంబర్ (హి.స.)ఢిల్లీ బ్లాస్ట్‌ తర్వాత ప్రధానంగా వినిపించిన పేరు ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం. ఈ యూనివర్సిటీ కేంద్రంగానే ఉగ్ర డాక్టర్ల బృందం.. దేశ వ్యాప్త పేలుళ్లకు కుట్రపన్నారు. టెర్రర్ మాడ్యూల్ బయటపడిన కొన్ని గంటలకే నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట దగ్గర కారు బ్లాస్ట్ జరిగింది. కారులో ఉన్న ఉగ్రవాది ఉమర్ సహా 15 మంది చనిపోయారు. పదులకొద్ది గాయాలు పాలయ్యారు. ఇక దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాక.. అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం బండారం బయటపడింది. యూనివర్సిటీ కేంద్రంగానే డాక్టర్ల బృందం పేలుళ్లకు ప్రణాళికలు రచించినట్లుగా తేల్చారు.

ఇప్పటికే జమ్మూకాశ్మీర్‌లో డాక్టర్ ఉమర్ ఇల్లును భద్రతా దళాలు పేల్చేశారు. తాజాగా అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయ సంస్థల అధినేత జావాద్ అహ్మద్ సిద్ధిఖీకి చెందిన పూర్వీకుల నివాసం కూల్చివేతకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే పలు నోటీసులు జారీ చేయగా.. చివరిగా మరోసారి జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande