
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ముంబై,,21, నవంబర్ (హి.స.)గోల్డ్ లవర్స్‌కు ధరలు మళ్లీ షాకిచ్చాయి. రెండు.. మూడ్రోజుల పాటు వరుసగా తగ్గుతున్న ధరలు.. బుధవారం మరొకసారి ఝలక్ ఇచ్చాయి. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.1,200 పెరగగా.. కిలో వెండిపై రూ.3,000 పెరిగింది. తగ్గుతున్నట్టే తగ్గి.. ఒక్కసారిగా భారీగా పెరగడంతో పసిడి ప్రియులు అవాక్కవుతున్నారు.
24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,200 పెరిగి రూ.1,24,860 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 1,100 పెరిగి రూ.1,14,450 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.900 పెరిగి రూ.93,640 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇక వెండి ధరలు కూడా షాకిచ్చాయి. కిలో వెండిపై రూ.3,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,65, 000 దగ్గర అమ్ముడవుతోంది. చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం రూ.1, 73,000 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.1,65, 000 దగ్గర అమ్ముడవుతోంది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ