సైబర్ కేటగాళ్ల మోసానికి ఓ విశ్రాంత విద్యాశాఖాధికారి 34.60 లక్షలు పోగొట్టుకున్నారు
ముమ్మిడివరం,, 21 నవంబర్ (హి.స.) : సైబర్‌ కేటుగాళ్ల మోసానికి ఓ విశ్రాంత విద్యాశాఖాధికారి(ఎంఈవో) రూ.34.60 లక్షలు పోగొట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముమ్మిడివరానికి చెందిన బి.రమణశ్రీకి ఈ నెల 8న వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. మీపై కేసు నమ
సైబర్ కేటగాళ్ల మోసానికి ఓ విశ్రాంత విద్యాశాఖాధికారి 34.60 లక్షలు పోగొట్టుకున్నారు


ముమ్మిడివరం,, 21 నవంబర్ (హి.స.)

: సైబర్‌ కేటుగాళ్ల మోసానికి ఓ విశ్రాంత విద్యాశాఖాధికారి(ఎంఈవో) రూ.34.60 లక్షలు పోగొట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముమ్మిడివరానికి చెందిన బి.రమణశ్రీకి ఈ నెల 8న వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. మీపై కేసు నమోదైందని అవతల వ్యక్తి చెప్పాడు. కేసుకు సంబంధించి మరో వ్యక్తితో మాట్లాడాలని ఓ ఫోన్‌ నంబరు ఇచ్చాడు. ఆ వ్యక్తిని సంప్రదించగా.. ఆధార్‌ నంబరు చెబితే పూర్తి వివరాలు చూస్తానని నమ్మించాడు. తర్వాత ఫోన్‌ చేసి పెద్ద కేసులో ఇరుక్కున్నారని, కెనరా బ్యాంకు ఏటీఎంలో జరిగిన రూ.3 కోట్ల అక్రమాల్లో మీ ఖాతాలో రూ.75 లక్షలు జమైందని చెప్పాడు. డిజిటల్‌ అరెస్ట్‌ పేరిట ఇతరులతో మాట్లాడకుండా చేశాడు. కేసు నుంచి బయటపడే మార్గం ఉందని చెప్పి.. ఆయన ఖాతాల్లోని రూ.15 లక్షలు తమ ఖాతాకు బదిలీ చేయించుకున్నారు. తర్వాత మరో రూ.20 లక్షలు డిమాండ్‌ చేశాడు.

తన వద్ద డబ్బులేదని చెప్పగా.. మోసగాడు పింఛను హామీతో వ్యక్తిగత రుణం తీసుకునేలా చేశాడు. ఆ సొమ్మును రెండు విడతలుగా రూ.9.80 లక్షలు చొప్పున వారు చెప్పిన ఖాతాల్లో బాధితుడు జమ చేశారు. ఈ నెల 8 నుంచి 15వ తేదీ వరకు ఈ వ్యవహారం సాగింది. బాధితుడు ఎట్టకేలకు బుధవారం అర్ధరాత్రి ముమ్మిడివరం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముమ్మిడివరం ఎస్సై డి.జ్వాలాసాగర్‌ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande