
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 21నవంబర్ (హి.స.)బిహార్ ఎన్నికల్లో సీట్ల పంపకాల్లో అలిగిన జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM).. స్వతంత్రంగా కూడా పోటీ చేయకుండా దూరంగా ఉండిపోయింది. కూటమి పెద్దన్న తమను మోసం చేసిందని.. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని ఓపెన్‌గా కాంగ్రెస్‌పైనే ఆరోపణలు గుప్పించింది. తమను జూనియర్ పార్ట్‌నర్‌లా అవమానకర రీతిలో చూస్తున్న కూటమిలో కొనసాగాలా.. వద్దా? అనేది త్వరలో నిర్ణయిస్తామని ప్రకటించింది కూడా.
మరో ఇండియా కూటమి పార్టీ.. శివసేన (UBT) బీహార్ ఫలితాన్ని ‘‘వేకప్ కాల్’’గా అభివర్ణించింది. వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్లు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమిష్టి వ్యూహం దెబ్బతిందని ఆరోపించింది. మిత్రపక్షాలతో జాతీయ పార్టీ సంప్రదింపులు లేకుండా ముందుకు వెళితే కూటమి నిలవదని హెచ్చరిస్తోంది.
సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేశ్ యాదవ్ బీహార్ ఎన్నికల్లో మిత్రపక్ష కూటమి వ్యవహరించిన తీరు నుంచి లోపాల్ని ఎత్తిచూపారు. ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలని.. భవిష్యత్తులో ఇలాంటి జోక్యాలు జరగకుండా చూసుకోవాలని పరోక్షంగా కాంగ్రెస్‌కు హితవు పలికారు. ఈ క్రమంలో ఇండియా కూటమి బాధ్యతల నుంచి కాంగ్రెస్ తప్పుకుని.. ఆ బాధ్యతల్ని అఖిలేష్‌కు అప్పగించాలంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తుండడం గమనార్హం
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ