16 రోజుల్లో 4249 కి.మీ సైక్లింగ్.. యాత్రికుడికి ఘనసత్కారం
ఖమ్మం, 21 నవంబర్ (హి.స.) సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టిన రోజును పురస్కరించుకుని కేటు కే సైక్లింగ్ లో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విజయవంతంగా తన రైడ్ పూర్తిచేసిన రేగళ్ల గోపిని శుక్రవారం ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి గ్రామం
ఖమ్మం న్యూస్


ఖమ్మం, 21 నవంబర్ (హి.స.)

సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టిన రోజును పురస్కరించుకుని కేటు కే సైక్లింగ్ లో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విజయవంతంగా తన రైడ్ పూర్తిచేసిన రేగళ్ల గోపిని శుక్రవారం ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి గ్రామంలో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. రోజుకు 250 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల వరకు సైక్లింగ్ చేయడం గర్వించదగ్గ విషయమని, 16 రోజుల్లో 4249 కిలోమీటర్లు విజయవంతంగా పూర్తి చేసిన రేగళ్ల గోపి మద్దులపల్లివాసీ కావటం గ్రామానికి గర్వించదగ్గ విషయమని ఈ సందర్భంగా వారు అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande