ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్లవారి మిట్ట జాతీయ రహదారి పై ప్రైవేట్ ట్రావెల్.బస్సు బోల్తా
నెల్లూరు,, 21 నవంబర్ (హి.స.):ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్ల వారి మిట్ట జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స
ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్లవారి మిట్ట జాతీయ రహదారి పై ప్రైవేట్ ట్రావెల్.బస్సు బోల్తా


నెల్లూరు,, 21 నవంబర్ (హి.స.):ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్ల వారి మిట్ట జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులతోపాటు 108కి సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం 108 వాహనంలో నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన స్థలాన్ని ఎస్ఐ నాగరాజు పరిశీలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande