టిటిడి శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి నెల.కోటాను నేడు ఆన్లైన్లో విడుదల చేయనుంది
అమరావతి, 21 నవంబర్ (హి.స.) TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు అలర్ట్‌ కావాల్సిన సమయం వచ్చేసింది.. శ్రీవారి దర్శనానికి సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను ఈ రోజు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇక, ఈ రోజు ఉదయం 10 గంటలకు –
టిటిడి  శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి నెల.కోటాను నేడు ఆన్లైన్లో విడుదల చేయనుంది


అమరావతి, 21 నవంబర్ (హి.స.)

TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు అలర్ట్‌ కావాల్సిన సమయం వచ్చేసింది.. శ్రీవారి దర్శనానికి సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను ఈ రోజు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇక, ఈ రోజు ఉదయం 10 గంటలకు – ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చేయనుండగా.. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదల చేయబోతున్నారు.. అయితే, శ్రీవారి దర్శనంతో పాటు వసతి గతులు, ఇతర సేవా టికెట్లు ఎప్పుడు విడుదల చేసినా.. నిమిషాల వ్యవధిలోనే కోటా పూర్తి అవుతూ వస్తున్నాయి.. దీంతో, ఆ సమయానికి అలర్ట్‌గా ఉండి.. టికెట్లను బుక్‌ చేసుకుంటే తప్ప.. టికెట్లు దొరకని పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. భక్తులు అలర్ట్‌ కావాల్సిన సమయం వచ్చింది..

మరోవైపు, తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించిన విషయం విదితమే.. డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1 తేదీలలో సర్వదర్శనం భక్తులకు మాత్రమే దర్శన అవకాశం ఇవ్వనున్నారు. సర్వదర్శనం భక్తులకు లక్కిడ్రా (Lucky Dip) విధానంలో దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. డిసెంబర్ 27 నుంచి జనవరి 1 వరకు భక్తులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.. 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది.. నిన్న శ్రీవారిని 66,839 మంది భక్తులు దర్శించుకోగా.. 19,220 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ.4.61 కోట్లుగా ప్రకటించింది టీటీడీ..

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande