
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 21నవంబర్ (హి.స.)దిల్లీ పేలుడు కేసులో (Delhi Blast Investigation) మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. దిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడు, ఆ సమయంలో కారు నడిపిన డా.ఉమర్ నబీకి బాంబుల తయారీలో శిక్షణనివ్వడానికి ఉగ్ర సంస్థలు పాకిస్థాన్ నుంచి బాంబు తయారీ వీడియోలు పంపినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. హంజుల్లా అనే జైషే మహమ్మద్ హ్యాండ్లర్ ఈ వీడియోలను అతడికి పంపినట్లు తెలుస్తోంది. మొత్తం 42 వీడియోలు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ఉగ్ర కుట్రల గురించి నిందితులు టెలిగ్రామ్ యాప్‌లో చర్చించుకునేవారని.. ఇతరులకు అనుమానం రాకుండా ఆయుధాలు, బాంబుల గురించి వంటకాల పేర్లను సీక్రెట్ కోడ్‌లుగా వాడేవారని అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాలకు బిర్యానీ అని, ఉగ్ర ఘటనలు అమలుచేయడానికి దావత్ అని కోడ్ నేమ్‌లను ఉపయోగించినట్లు గుర్తించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ