
ముంబై, 22 నవంబర్ (హి.స.)బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి.. ఇటీవల కాలంలో ఏకంగా లక్షా 30 వేల మార్క్ దాటి పరుగులు పెట్టిన ధరలు.. ఆ తర్వాత తగ్గాయి.. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుతుండటంతో.. ఇటీవల దేశీయంగా తగ్గాయి.. ఈ క్రమంలోనే, గోల్డ్ ధరలు మళ్లీ పెరుగుతుండటంతో పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా.. మళ్లీ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారంపై రూ.1,860 పెరిగింది. వెండి కిలోపై రూ.3వేలు పెరిగింది.
పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. శనివారం (నవంబర్ 22 2025) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1,860 మేర ధర పెరిగి.. రూ.1,25,840 గా ఉంది.
22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.1,700 మేర ధర పెరిగి.. రూ.1,15,350 గా ఉంది.
ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV