
కోరుట్ల, 22 నవంబర్ (హి.స.)
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కోరుట్ల పట్టణంలో యూనిటీ మార్చ్ ను శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడారు. ఉక్కుమనిషి సర్దార్ వల్ల భాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని యూనిటీ మార్చ్ నిర్వహించామని, దేశానికి ఆయన సేవలు వెలకట్టలేనివి అన్నారు. స్వాతంత్య్రం తర్వాత కూడా నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో కలపడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరువ మరువలేనిదన్నారు. దేశ ఐక్యత కోసం ప్రతిక్షణం పరితపించిన మహనీయుడు వల్లభాయి పటేల్ అని కొనియాడారు.
దేశ ఐక్యత, సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి ఆలోచనల ప్రాముఖ్యత, యువత దేశ నిర్మాణంలో తీసుకోవాల్సిన బాధ్యతలను వారు వివరించారు. విద్యతో పాటు క్రమశిక్షణ, సమాజ సేవ, దేశభక్తి వంటి విలువలను జీవితంలో అలవరచుకోవాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు