'ఇందిరమ్మ చీరల' పంపిణీ చేసిన మానకొండూరు ఎమ్మెల్యే
కరీంనగర్, 22 నవంబర్ (హి.స.) కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం ''ఇందిరమ్మ చీరల'' పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. మొత్తం 14,682 చీరల్లో భాగంగా తొలి విడతగా 12,600 చీరలు సిద్ధ
మానకొండూరు ఎమ్మెల్యే


కరీంనగర్, 22 నవంబర్ (హి.స.)

కరీంనగర్ జిల్లా మానకొండూరు

మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం 'ఇందిరమ్మ చీరల' పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. మొత్తం 14,682 చీరల్లో భాగంగా తొలి విడతగా 12,600 చీరలు సిద్ధమయ్యాయి. అర్హత ఉన్న 18 ఏళ్లకు పైబడిన ప్రతి మహిళకు చీరలు అందించే విధంగా అధికారులు ఇంటింటికీ వెళ్లి మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల సభ్యులందరికీ చీరలు అందుతాయని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande