
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 23 నవంబర్ (హి.స.)పంజాబ్, హరియాణా సంయుక్త రాజధాని చండీగఢ్ (Chandigarh)లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తీసుకొచ్చేలా రాజ్యాంగ అధికరణ 131 సవరణ బిల్లును పంజాబ్‌లోని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు ఆమోదం పొందితే చండీగఢ్ ఆర్టికల్ 240 పరిధిలోకి వస్తుంది.
ఈ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), కాంగ్రెస్ (Congress), అకాలీదళ్ (Akali Dal) తీవ్రంగా వ్యతిరేకించాయి. పంజాబ్ సీఎం, ఆప్ నేత భగవంత్ మాన్ స్పందిస్తూ భాజపా ప్రభుత్వం పంజాబ్ రాజధానిని లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చండీగఢ్ గతంలో, ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా పంజాబ్‌లోని విడదీయరాని భాగమని పేర్కొన్నారు. ఈ నగరాన్ని నిర్మించేందుకు తమ గ్రామాలను నాశనం చేశారన్నారు. పంజాబ్‌కు దానిపై హక్కు ఉందని వెల్లడించారు. ఆ నగరాన్ని తాము ఏమాత్రం వదులుకోమని.. అవసరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ