
అనకాపల్లి,: 23 నవంబర్ (హి.స.)
బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్( )తల్లి సి.రత్నమ్మ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు సమాచారం. వయో సంబంధిత ఆరోగ్య సమస్యలతో రత్నమ్మ బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. రత్నమ్మ పరిస్థితి తీవ్రంగా ఉందని డాక్టర్లు కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు సమాచారం. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సీఎం రమేశ్‌తో సహా వారి కుటుంబ సభ్యులంతా ఆస్పత్రికి చేరుకున్నారు. రత్నమ్మ త్వరగా కోలుకోవాలని అనుచరులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ