
రెంటచింతల 23 నవంబర్ (హి.స.)
: పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. పాలువాయి జంక్షన్‌లోని బయో డీజిల్ బంకులో ట్యాంక్ పేలింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ