సత్యసాయిబాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టం : త్రిపుర గవర్నర్
పుట్టపర్తి, 23 నవంబర్ (హి.స.)పుట్టపర్తిలో జరుగుతున్న శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం సాయి కుల్వంత్ హాల్లో జరిగిన వేడుకల్లొ పాల్గొన్నారు.
సత్యసాయిబాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టం : త్రిపుర గవర్నర్


పుట్టపర్తి, 23 నవంబర్ (హి.స.)పుట్టపర్తిలో జరుగుతున్న శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం సాయి కుల్వంత్ హాల్లో జరిగిన వేడుకల్లొ పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి మాట్లాడుతూ గతంలో సత్యసాయిబాబాను వ్యక్తిగతంగా కలిసి ఆశీర్వాదం పొందామన్నారు. సత్యసాయిబాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చేయు వంటి సూత్రాల ద్వారా ప్రజాసేవ చేశారని తెలిపారు. సత్యసాయిబాబా లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత అందరిపై ఉందన్నారు. మానవాళి ఆనందంగా జీవించాలనే ఏకైక లక్ష్యంతో ఆయన పనిచేశారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande