పుట్టపర్తిలో మంత్రి లోకేశ్‌ ప్రజాదర్బార్.. వెల్లువెత్తిన వినతులు
పుట్టపర్తి, 23 నవంబర్ (హి.స.) రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ పుట్టపర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో 74వ రోజు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు శ్రీ సత్యసాయి జిల్లా నలుమూలల నుంచి సామాన్య ప్రజలు, టీ
Lokesh


పుట్టపర్తి, 23 నవంబర్ (హి.స.)

రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ పుట్టపర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో 74వ రోజు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు శ్రీ సత్యసాయి జిల్లా నలుమూలల నుంచి సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన లోకేశ్‌, వారి సమస్యలను ఓపికగా విని వినతిపత్రాలు స్వీకరించారు.

ప్రజాదర్బార్‌లో పలువురు తమ గోడును మంత్రి ముందు వెళ్లబోసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రోద్బలంతో తనపై అక్రమ కేసులు బనాయించారని, వాటిని ఎత్తివేయాలని ముదిగుబ్బ మండలానికి చెందిన డి. లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా చెన్నేకొత్తపల్లిలో తాను కొనుగోలు చేసిన ఇంటి స్థలాన్ని వైసీపీ నేతల అండతో కబ్జా చేశారని మాకర్లకుంటపల్లికి చెందిన టి. నాగభూషణం మంత్రికి ఫిర్యాదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande