
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ముంబై,,23, నవంబర్ (హి.స.)ఎన్‌సీపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నిధుల సమస్య అనేదే లేకుండా చేస్తాం, ఓటు వేయకుంటే మాత్రం, తామూ పట్టించుకోమని ఓటర్లను హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. అతడి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక, వివరాల్లోకి వెళితే.. శుక్రవారం నాడు బారామతి జిల్లా మాలెగావ్ నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అజిత్ పవార్ ఈ కామెంట్స్ చేశారు. బీజేపీ- ఎన్‌సీపీ- శివసేన సంకీర్ణ సర్కార్ లో పవార్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు.
ఇక, మా ఎన్‌సీపీ అభ్యర్థులు 18 మందిని గెలిపిస్తే నిధుల ఇస్తాం.. నేను ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తాను.. కానీ, మా అభ్యర్థులను తిరస్కరించిన పక్షంలో నిధులు ఇవ్వను.. మీ దగ్గర ఓట్లుంటే, నా దగ్గర నిధులు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పేర్కొన్నారు. దీంతో అతడి వ్యాఖ్యలపై విపక్షలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఆయనపై ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్) నాయకుడు అంబదాస్ దన్వే మాట్లాడుతూ.. నిధులు అజిత్ పవార్ ఇంటి నుంచి కాకుండా సామాన్య ప్రజలు చెల్లించే పన్నుల నుంచి ఇవ్వబడాయని తెలిపారు. పవార్ లాంటి నాయకుడు ఓటర్లను బెదిరిస్తుంటే, ఈసీ ఏం చేస్తోంది? అని క్వశ్చన్ చేశారు. కాగా, మహారాష్ట్రలో నగర పంచాయతీలకు ఎన్నికలు డిసెంబర్ 2వ తేదీన జరుగబోతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ