లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ, 23 నవంబర్ (హి.స.): లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పుట్టినరోజు సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన్ ఎక్స్‌లో పోస్టు చేశారు. అందులో స్పీకర్ బిర్లా శాంత స్వభావం, ఏకతా దృష్టి,
Modi


న్యూఢిల్లీ, 23 నవంబర్ (హి.స.): లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పుట్టినరోజు సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన్ ఎక్స్‌లో పోస్టు చేశారు. అందులో స్పీకర్ బిర్లా శాంత స్వభావం, ఏకతా దృష్టి, పార్లమెంట్ నిర్వహణలో చూపుతున్న నాయకత్వాన్ని ప్రశంసించారు. చట్ట సభ ప్రక్రియలను బలోపేతం చేయడం, నిర్మాణాత్మక చర్చలకు వేదిక కల్పించడం, పార్లమెంట్ గౌరవాన్ని నిలబెట్టడంలో ఓం బిర్లా కృషి విస్తృతంగా గుర్తింపు పొందిందని మోదీ పేర్కొన్నారు. పార్లమెంట్‌ను మరింత ఫలప్రదంగా, ప్రజా ప్రధానంగా మార్చేందుకు స్పీకర్ బిర్లా నిరంతరం శ్రమిస్తున్నారని ప్రధాని అభినందించారు. దేశ సేవలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలగాలని ఈ సందర్భంగా మోడీ ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande