నిద్రలేవగానే నోరు దుర్వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..! రిలాక్స్‌ అవుతారు..
కర్నూలు, 23 నవంబర్ (హి.స.)రోజుకు రెండు పూట బ్రష్‌ చేసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. పడుకునే ముందు పళ్ళు తోముకోవడం ప్రాథమిక పరిశుభ్రతలో ఒక భాగం. కానీ, చాలా మంది బద్ధకంతో ఈ అలవాటును విస్మరిస్తూ ఉంటారు. అలాగే, ఎక్కువ మందికి రాత్రిపూట బ్రష్‌ చేసుకునే అ
J


కర్నూలు, 23 నవంబర్ (హి.స.)రోజుకు రెండు పూట బ్రష్‌ చేసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. పడుకునే ముందు పళ్ళు తోముకోవడం ప్రాథమిక పరిశుభ్రతలో ఒక భాగం. కానీ, చాలా మంది బద్ధకంతో ఈ అలవాటును విస్మరిస్తూ ఉంటారు. అలాగే, ఎక్కువ మందికి రాత్రిపూట బ్రష్‌ చేసుకునే అలవాటు ఉండదు. అలాంటి వారిలో కొందరికి ఉదయాన్నే నోరు దుర్వాసన వస్తుంది. కొన్నిసార్లు రాత్రి పళ్ళు తోముకున్న తర్వాత కూడా కొంతమందిలో ఉదయాన్నే నోటి నుండి దుర్వాసన వస్తుంది. ఇది చాలా సాధారణ సమస్య. నోటి దుర్వాసన అనేది సాధారణంగా మీరు తీసుకునే ఆహారం, పానీయాల వల్ల వస్తుంది. తిన్న పళ్లల్లో ఇరుక్కుపోవటం, రాత్రంతా నోటిలో ఉండిపోవటం కారణంగా అవి దుర్వాసనను కలిగిస్తాయి. నోటిలో ఉండిపోయిన ఆహారంతో ఎక్కువ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది దుర్వాసనకు కారణమవుతుంది.

నోటి దుర్వాసనను నివారించడానికి బెస్ట్‌ రెమిడీ నోటి పరిశుభ్రతను పాటించడం. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు కూడా బ్రష్‌ చేసుకోవటం తప్పనిసరి. కనీసం రెండు నిమిషాలు మీ దంతాలను బ్రష్ చేయండి. మీ చిగుళ్ళు, నాలుక, మీ బుగ్గల లోపలి భాగాన్ని కూడా సున్నితంగా బ్రష్ చేయండి. ఎందుకంటే అక్కడ బ్యాక్టీరియా ఉండవచ్చు. ఎల్లప్పుడూ ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్, యాంటీ బాక్టీరియల్ మౌత్‌వాష్ ఉపయోగించండి. ఇకపోతే, నోటి దుర్వాసనను దూరం చేసే కొన్ని హోం రెమిడీస్ ఇక్కడ చూద్దాం..

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande