సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి.. లేకుంటే నష్టపోతారు!
న్యూఢిల్లీ, 23 నవంబర్ (హి.స.)చాలా మందికి కారు కొనాలని ఉంటుంది. కానీ కొత్త కారు కొనేందుకు అవసరమైన బడ్జెట్ ఉండదు. అందుకే మధ్యతరగతి వారు సెకండ్ హ్యాండ్ కారు కొనేందుకు ప్లాన్ చేసుకుంటారు. అయితే ఈ సెకండ్ హ్యాండ్ కారు కొనే ముందు చాలా విషయాల తెలుసుకోవాల్స
Car


న్యూఢిల్లీ, 23 నవంబర్ (హి.స.)చాలా మందికి కారు కొనాలని ఉంటుంది. కానీ కొత్త కారు కొనేందుకు అవసరమైన బడ్జెట్ ఉండదు. అందుకే మధ్యతరగతి వారు సెకండ్ హ్యాండ్ కారు కొనేందుకు ప్లాన్ చేసుకుంటారు. అయితే ఈ సెకండ్ హ్యాండ్ కారు కొనే ముందు చాలా విషయాల తెలుసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే నష్టపోతారు. కొత్త కారు కొనే స్థితిలో లేనివారు సెకండ్స్‌కు వెళ్తుంటారు. అయితే సెకండ్‌ హ్యాండ్‌ కారు కొంటున్నట్లయితే ముందు ఈ విషయాలను గుర్తించుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే భారీగా నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు టెక్‌ నిపుణులు.

సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. కాస్త అజాగ్రత్తగా ఉన్నా పెద్ద ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. కొన్ని చిట్కాలను పాటిస్తే ఎలాంటి సమస్యలు లేని మంచి సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయవచ్చు.

ముందుగా మీ బడ్జెట్‌ సెట్‌ చేసుకోండి: సెకండ్ హ్యాండ్ కారు కొనడానికి ముందు, మొదట చేసేపని మీ బడ్జెట్‌ను నిర్ణయించుకోవడం. మీ బడ్జెట్‌ దాటి వెళితే ఆర్థిక భారం పెరుగుతుంది. సరైన అవగాహన లేకుండా కొంటే దాదాపు కొత్త కారు ధర అవుతుంది. సెకండ్‌ హ్యాండ్‌ కార్లు అమ్మే వివిధ ప్లాట్‌ఫామ్‌లలో అదే కారు ధరను చెక్‌ చేయండి. మీ బడ్జెట్‌ను బట్టి ఒక ఫ్లాట్‌ఫామ్‌ను ఎంచుకోండి.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande