
శ్రీకాకుళం , 23 నవంబర్ (హి.స.)కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద ఆగి ఉన్న లారీని వ్యాను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన సింగ్ పవార్(60), విజయ్ సింగ్ తోమర్(65), కుసాల్ సింగ్(62), సంతోషి భాయ్(62)గా గుర్తించారు. శ్రీశైలం ఆలయ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ