సత్యసాయి ప్రవచనాలు ప్రపంచవ్యాప్తమయ్యాయి : ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
పుట్టపర్తి, 23 నవంబర్ (హి.స.)పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు హాజరైన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సత్యసాయిబాబా సేవలను కొనియాడారు. సత్యసాయిబాబా ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రపంచవ్యాప్తమయ్యాయి అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవా మార
Vice president


పుట్టపర్తి, 23 నవంబర్ (హి.స.)పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు హాజరైన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సత్యసాయిబాబా సేవలను కొనియాడారు. సత్యసాయిబాబా ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రపంచవ్యాప్తమయ్యాయి అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవా మార్గానికి ప్రతిరూపంగా నిలిచారన్నారు. పేదలకు నిస్వార్థ సేవలు అందించారన్నారు. మానవసేవే మాధవసేవ అని నమ్మడమే కాకుండా ఆచరించి చూపారన్నారు. ప్రపంచమంతా ప్రేమను పంచిన ప్రేమమూర్తి సత్యసాయిబాబా అని తెలిపారు. లక్షల మందిని సేవా మార్గంలో నడిపించారన్నారు. సత్యసాయి ట్రస్ట్ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సేవలందిస్తోందన్నారు. తమ సేవల ద్వారా లక్షల మందికి తాగునీరు ఉచితంగా సరఫరా చేసి దాహార్తిని తీర్చారన్నారు. ఎన్నో వైద్యశాలలు స్థాపించి పేదలకు ఉచిత వైద్యం అందిస్తుండడం గొప్ప విషయంగా అభివర్ణించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande