
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
చెన్నై , , 23,నవంబర్ (హి.స.) నవంబర్ 23: తమిళనాడులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)కి వ్యతిరేకంగా తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ గళం విప్పింది. 'సర్'(SIR Tamil Nadu)ని నిలిపివేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. SIR పై ఇప్పటికే అధికార డీఎంకే పార్టీ సుప్రీంను ఆశ్రయించింది. టీవీకే వేసిన పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను సరిచేయడానికి, దొంగ ఓట్లను తొలగించడానికి ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవల బిహార్ రాష్ట్రంలో సర్ ను అమలు చేసిన సంగతి తెలిసిందే. బీహార్‌లో విజయవంతంగా అమలు చేసిన ఈ ప్రక్రియను దేశమంతా చేపట్టాలని ఎలక్షన్ కమీషన్(Elections Commission) నిర్ణయించింది. ఓటరు జాబితా కంప్యూటరీకరణ జరిగిన గత రెండు దశాబ్దాలుగా గణనీయమైన మార్పులు సంభవించాయని ఈసీ గుర్తించింది. గతంలో బీహార్‌లో సర్ కారణంగా 68.66 లక్షల ఓటర్లను జాబితా నుండి తొలగించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ