ఈ నెల 28న అమరావతికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ .. కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన
అమరావతి, 23 నవంబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా, ఈ నెల 28న ఒకేసారి 25 బ్యాంకుల భవన నిర్మాణాలకు భూమి పూజ
నిర్మలా సీతారామన్


అమరావతి, 23 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా, ఈ నెల 28న ఒకేసారి 25 బ్యాంకుల భవన నిర్మాణాలకు భూమి పూజ జరగనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేయనున్నారు.

అమరావతిలోని సీఆర్‌డీఏ (CRDA) ప్రధాన కార్యాలయం సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సహా మొత్తం 25 జాతీయ, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన నూతన భవనాలు, అధికారుల నివాస సముదాయాలకు ఒకే వేదికపై నుంచి పునాది రాయి వేయనుండటం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారాయణ, నారా లోకేశ్ తదితరులు హాజరుకానున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande