
అమరావతి, 23 నవంబర్ (హి.స.):బెజవాడ పోలీసులకు చిక్కిన మావోయిస్టులను వారం రోజులు కస్టడీ కోరేందుకు విజయవాడ పోలీసులు సమాయత్తమవుతున్నారు. మావోల కదలికలు, తదితర సమాచారం సేకరించేందుకు, దీనిపై లోతైన విచారణ జరపటానికి పోలీసులు ఈ నిర్ణయానికి వచ్చారు. కృష్ణాజిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన మొత్తం 28 మంది మావోయిస్టులను 3 దఫాలుగా పోలీసులు కస్టడీ కోరనున్నారు. మొదటగా 10 మందిని కస్టడీ కోరుతూ రేపు పిటిషన్ వేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ