
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}ఢిల్లీ 23 నవంబర్ (హి.స.): విద్యుదుత్పత్తి, వైద్య చికిత్సలు తదితర పౌర అవసరాలకు అణు శక్తి వినియోగం, ఆయా రంగాల్లో పరిశోధనలను ప్రోత్సహించేలా ప్రైవేటు సంస్థలను అనుమతించే కీలకమైన బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లు, జాతీయ రహదారుల (సవరణ) బిల్లు, కార్పొరేట్ చట్టాల (సవరణ) బిల్లు, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు వంటి ముఖ్యమైనవి కూడా ఈ సమావేశాల్లోనే పార్లమెంటు ఆమోదం కోసం రానున్నాయి. డిసెంబరు 1న ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాలు అదే నెల 19 వరకు కొనసాగుతాయి. ఈ సెషన్‌లో దాదాపు 15 సార్లు పార్లమెంటు ఉభయ సభలు సమావేశమవుతాయి. పది బిల్లులకు ఆమోదం పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నించనున్నట్లు లోక్‌సభ బులెటిన్ వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ