సీజేఐ గవాయ్‌ పదవీకాలంలో 10 మంది ఎస్సీ జడ్జీల నియామకం
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;fon
సీజేఐ గవాయ్‌ పదవీకాలంలో 10 మంది ఎస్సీ జడ్జీల నియామకం


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ 23 నవంబర్ (హి.స.): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ తన ఆరు నెలల పదవీకాలంలో షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన పది మంది, వెనుకబడిన తరగతులకు చెందిన 11 మంది న్యాయమూర్తులను వివిధ రాష్ట్రాల హైకోర్టులకు నియమించారు. జస్టిస్‌ గవాయ్‌ నేతృత్వంలోని త్రిసభ్య కొలీజియం వివిధ హైకోర్టులకు న్యాయమూర్తులుగా 129 మంది పేర్లను సిఫార్సుచేసింది. వీటిలో 93 మంది పేర్లను ఆమోదించారు. వీరిలో 13 మంది మైనారిటీ వర్గానికి చెందినవారు కాగా.. మరో 15 మంది మహిళా న్యాయమూర్తులు. ఐదుగురు మాజీ, ప్రస్తుత న్యాయమూర్తులకు సంబంధించిన వారు కాగా, 49 మంది బార్‌ నుంచి, మిగతావారు సర్వీస్‌ క్యాడర్‌ నుంచి నియమితులయ్యారు. ఈయన పదవీకాలంలోనే జస్టిస్‌ ఎన్‌.వి.అంజరియా, జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్, జస్టిస్‌ ఎ.ఎస్‌.చందూర్కర్, జస్టిస్‌ అలోక్‌ ఆరాధే, జస్టిస్‌ విపుల్‌ మనుభాయ్‌ పంచోలిలు సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు నియమితులయ్యారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande