
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
తిరువనంతపురం:/చెన్నై , , 23,నవంబర్ (హి.స.) కేరళలో అయ్యప్ప దర్శనాలు జరుగుతున్న వేళ బ్రెయిన్ ఫీవర్ టెన్షన్ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. కేరళలో స్నానాలు చేసే వేళ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వైద్యులు సైతం తగు సూచనలు చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. కేరళలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ కారణంగా బ్రెయిన్ ఫీవర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో, అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రభుత్వం, వైద్య నిపుణులు కీలక సూచనలు చేశారు. దర్శనం సమయంలో స్నానాలు చేసే ముందు భక్తులు జాగ్రత్తా ఉండాలి. నీళ్లు ముక్కులోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా మెదడులోకి చేరుతుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఒకవేళ అమీబా మొదడులోకి చేరితే ఈ పరిస్థితి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందన్నారు. అయితే, ఈ ఇన్ఫెక్షన్ మాత్రం ఒకరి నుంచి మరొకరికి సోకదని వైద్యులు వెల్లడించారు. అధిక జ్వరం ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ