
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 23 నవంబర్ (హి.స.) దేశ న్యాయవ్యవస్థ అధినేతగా తన ముందు రెండు ప్రాధాన్యాలు ఉన్నాయని ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. దేశంలో పేరుకుపోయిన సుమారు 4.6 కోట్ల కేసుల పరిష్కారం ఇందులో మొదటిది కాగా, ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం కోసం మధ్యవర్తిత్వానికి ఊతమివ్వడం రెండోదని ఆయన అన్నారు. ఆన్‌లైన్‌లో జడ్జీలను, వారి తీర్పులను అవహేళన చేయడం(ట్రోలింగ్) తనను ఏనాడూ కలవరపాటుకు గురిచేయలేదని ఆయన అన్నారు.
న్యాయమైన, నిష్పాక్షికమైన విమర్శను తాను ఎల్లవేళలా స్వాగతిస్తానని తెలిపారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి 53వ ప్రధాన న్యాయమూర్తిగా అక్టోబరులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నియమించిన జస్టిస్ సూర్యకాంత్ సోమవారం పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. ఈ సందర్భంగా ఆయన తన అధికార నివాసంలో విలేకరులతో ముచ్చటించారు. ‘‘పెండింగ్ కేసులు నా ముందున్న అతిపెద్ద సవాలు. ఒక్క సుప్రీంకోర్టులోనే 90 వేల కేసులు పెండింగులో ఉన్నాయని తాజా నివేదికలు చెబుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ