థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలు బంద్.. ట్రంప్ సంచలన ప్రకటన
హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.) వైట్ హౌస్ సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డు సిబ్బందిపై ఓ అఫ్ఘాన్ జాతీయుడు కాల్పులు జరిపిన నేపథ్యంలో థర్డ్ వరల్డ్ దేశాలు (పేద దేశాలు) అన్నిటి నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటి
ట్రంప్ సంచలన


హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.)

వైట్ హౌస్ సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డు సిబ్బందిపై ఓ అఫ్ఘాన్ జాతీయుడు కాల్పులు జరిపిన నేపథ్యంలో థర్డ్ వరల్డ్ దేశాలు (పేద దేశాలు) అన్నిటి నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ చర్య ప్రపంచ దేశాలపైన ప్రతికూల ప్రభావం చూపడంతోపాటు ఉపాధి, విద్య కోసం అమెరికాకు వలసపోతున్న కోట్లాది మంది విదేశీయులపై తీవ్ర ప్రభావం చూపనున్నది.

తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ ద్వారా ఈ విషయాన్ని ట్రంప్ తెలియచేస్తూ.. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో చట్టవ్యతిరేకంగా దేశంలోకి జరిగిన కోట్లాది మంది ప్రవేశాలను రద్దు చేస్తానని ఆయన తెలిపారు. అమెరికా అభివృద్ధికి పనికిరాని, తమ దేశాన్ని ప్రేమించడం చేతకాని ఎవరినైనా దేశం నుంచి పంపించివేస్తామని ఆయన హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande