
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf4{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ నవంబర్ 03 (హి.స.) మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటోన్న రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా అనిల్ అంబానీ (Anil Ambani)కి సంబంధించిన రూ.3వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ (ED Attaches Assets of Anil Ambani) అధికారిక వర్గాలు సోమవారం వెల్లడించాయి. అటాచ్ చేసిన ఆస్తుల జాబితాలో ఆయన నివాసంతో పాటు పలు కమర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయి.
ముంబయిలోని పాలి హిల్ ప్రాంతంలో గల అనిల్ అంబానీ నివాసం, దిల్లీలోని రిలయన్స్ సెంటర్‌కు చెందిన కొంత భూమిని ఈడీ (Enforcement Directorate) అటాచ్ చేసింది. వీటితో పాటు దిల్లీ, నోయిడా, గాజియాబాద్, ముంబయి, పుణె, ఠాణె, హైదరాబాద్, చెన్నై, తూర్పుగోదావరిలో అనిల్ అంబానీ కంపెనీలకు చెందిన పలు నివాస, వాణిజ్య ఆస్తులు ఈ జాబితాలో ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ.3,084 కోట్లు అని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ