
కర్నూలు, 3 నవంబర్ (హి.స.)బీట్‌రూట్ తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే, దీనిని నమలడం మంచిదా లేక జ్యూస్ తాగడం మంచిదా అనే విషయంలో ప్రజలు తరచుగా గందరగోళానికి గురవుతారు. ఈ కథనంలో.. బీట్‌రూట్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో నిపుణుల నుంచి తెలుసుకుందాం..
దుంప జాతికి చెందిన బీట్‌రూట్‌లో ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.. దీనిని సహజ శక్తిని పెంచేదిగా కూడా పిలుస్తారు. హెల్త్‌లైన్ ప్రకారం, బీట్‌రూట్‌లో ఐరన్, ఫోలేట్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వు పదార్థాలు ఉంటాయి. బీట్‌రూట్ రక్త ప్రసరణను పెంచడానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది.. ఇంకా గుండె ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కొంతమంది బీట్‌రూట్‌ను సలాడ్‌గా ఆస్వాదిస్తారు.. మరికొందరు బీట్‌రూట్ జ్యూస్ తాగుతారు.
ఇలాంటి పరిస్థితుల్లో, ప్రజలు తరచుగా బీట్‌రూట్ దుంపలు నమలి తినడం లేదా జ్యూస్ తాగడం.. ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది..? అని ఆలోచిస్తారు. మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, ఈ కథనం మీ కోసమే. ఇక్కడ, బీట్‌రూట్ తినడం వల్ల మీ ఆరోగ్యానికి ఎలా ప్రయోజనకరంగా ఉంటుందనే దానిపై నిపుణుల సలహాను మేము పంచుకుంటున్నాము..
నిపుణులు ఏమంటున్నారంటే..
ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్‌లో సీనియర్ డైటీషియన్ అయిన ఫరేహా షానమ్.. బీట్‌రూట్ నమలడం.. దాని రసం తాగడం వల్ల దేనకదే.. వాటి స్వంత ప్రయోజనాలు ఉన్నాయని వివరిస్తున్నారు. ఉదాహరణకు, బీట్‌రూట్ రసం తాగడం వల్ల శరీరానికి నైట్రేట్లు పెరుగుతాయి.. ఇది రక్తపోటును నియంత్రించడంలో, వ్యాయామ సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. బీట్‌రూట్‌ను నమలడం – సలాడ్‌గా తీసుకోవడం వల్ల శరీరంలో ఫైబర్ తీసుకోవడం పెరుగుతుంది.
బీట్‌రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
హెల్త్‌లైన్ ప్రకారం, బీట్‌రూట్ తినడం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, బీట్‌రూట్ తినడం లేదా దాని రసం తాగడం వల్ల రక్తపోటు 3-10 mm Hg తగ్గుతుంది.
ఇది వ్యాయామ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.
బీట్‌రూట్ లోని ఫైబర్ కంటెంట్ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక.
బీట్‌రూట్ రసం శరీరాన్ని కూడా నిర్విషీకరణ చేస్తుంది.
ఇంకా, దానిలో ఐరన్ కంటెంట్ ఉండటం వల్ల, ఇది రక్తహీనతతో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV