
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf4{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ నవంబర్ 03 (హి.స.): తెలంగాణలోని చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగ్రాతులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు
2
భారత్ టెక్ పవర్‌హౌస్‌గా ఎదిగేందుకు ప్రైవేటు పెట్టుబడులు: ప్రధాని మోదీ
భారత్ అత్యంత క్లిష్టమైన, అధిక ప్రభావం చూపే పరిశోధన అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం (Research and Development Projects) మరింత అభివృద్ధి చెందడానికి, భారత్ టెక్ పవర్‌హౌస్‌గా ఎదగడానికి ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడుల (Private Investments)ను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. న్యూదిల్లీలోని భారత్ మండపంలో రూ.లక్ష కోట్ల పరిశోధనాభివృద్ధి ఫండ్‌ను ప్రారంభించిన అనంతరం మోదీ ప్రసంగించారు. దేశంలో ఆధునిక ఆవిష్కరణలను మరింత పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం భారతదేశ పరిశోధన, అభివృద్ధి వ్యయం రెట్టింపు చేశామన్నారు. ఈ చర్యలు భవిష్యత్ ఆవిష్కరణలపై తమ నిబద్ధతను తెలియజేస్తున్నాయన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ