
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf4{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ నవంబర్ 03 (హి.స.)అణు పరీక్షలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కూడా అణు పరీక్షలు చేయబోతుందని ట్రంప్ ప్రకటించారు. ఆదివారం సీబీఎస్ న్యూస్‌తో ‘60 మినిట్స్’ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. అణు పరీక్షలపై అడిగిన ప్రశ్నలకు ట్రంప్ సమాధానం ఇస్తూ.. అన్ని దేశాలు అణు పరీక్షలు చేస్తు్న్నాయని.. ప్రపంచ ధోరణిని బట్టి అమెరికా కూడా అణు పరీక్షలు చేయాల్సి వస్తుందని తెలిపారు. ట్రంప్ ప్రకటనతో మూడు దశాబ్దాల తర్వాత అమెరికా అణు పరీక్షలు చేయడానికి సిద్ధపడుతోంది. ఇక ట్రంప్ ప్రకటనపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది.
రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్థాన్‌తో సహా అనేక దేశాలు అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని.. అమెరికా మాత్రమే అలా చేయని ఏకైక దేశంగా మిగిలిపోయిందని అన్నారు. ప్రపంచ ధోరణి ప్రకారమే అమెరికా ముందుకు వెళ్తోందని చెప్పుకొచ్చారు.
7
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ