
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf4{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ముంబై, 03, నవంబర్ (హి.స.)దేశీయ స్టాక్ మార్కెట్ల గమనం ఈ వారం అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. దేశీయంగా జీఎ్‌సటీ వసూళ్లు, కంపెనీల ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. యూఎస్ రిజర్వ్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించటం, టారిఫ్స్ నేపథ్యంలో అప్రమత్తత అవసరం. ప్రస్తుతం చమురు, రియల్టీ, ఇన్‌ఫ్రా, పీఎ్‌సయూ బ్యాంకుల షేర్లు బలాన్ని ప్రదర్శిస్తున్నాయి.
రబిందో ఫార్మా: కొన్ని నెలలుగా డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తున్న ఈ షేరు రివర్సల్ బాట పడుతోంది. క్రమంగా బలం పుంజుకుంటోంది. డెలివరీ వాల్యూమ్ పెరుగుతోంది. గత శుక్రవారం రూ.1,138 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,100 వద్ద పొజిషన్ తీసుకుని రూ.1,250/1,330 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.1,050 వద్ద కచ్చితమైన స్టాప్‌లాస్ పెట్టుకోవాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ