సీఎస్‌ల క్షమాపణలు.. మళ్లీ ‘సుప్రీం’ సమన్లు
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}ఢిల్లీ, : , 3 నవంబర్ (హి.స.) body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{} వ
stray dog attack


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}ఢిల్లీ, : , 3 నవంబర్ (హి.స.) body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}

వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు ఎదుట హాజరైన పలు రాష్ట్రాల సీఎస్‌లు సోమవారం క్షమాపణలు తెలియజేశారు. కోర్టు ఉత్తర్వుల అమలు నేపథ్యంతో సకాలంలో అఫిడవిట్లు దాఖలు చేయకపోవడంపై వివరణలు ఇచ్చాకున్నారు. అయితే ఈ వ్యవహారంలో స్పష్టత లేకపోవడంతో మరోసారి అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శలకు సమన్లు జారీ చేసింది.

వీధి కుక్కల అంశం కేసులో ఇవాళ సుప్రీం కోర్టు ఎదుట పలు రాష్ట్రాల సీఎస్‌లు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల అమలుపై సకాలంలో అఫిడవిట్లు దాఖలు చేయనందుకు ప్రధాన కార్యదర్శులు క్షమాపణలు చెబుతున్నట్లు సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు వివరించారు. అయితే.. చాలా వరకు రాష్ట్రాలు ప్రమాణ పత్రాలు దాఖలు చేశాయని వెల్లడించారాయన. ఈ క్రమంలో..

జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ జోక్యం చేసుకుని.. దాద్రా నగర్‌ హవేలీ, దామన్‌ డయ్యూలు అఫిడవిట్లు దాఖలు చేయలేదన్న విషయాన్ని తీసుకొచ్చారు. ఆ వెంటనే సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ కలుగజేసుకుని కీలక సమాచారం లేదంటూ బెంచ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పష్టత ఇవ్వాలని కోరుతూ సమన్లు జారీ చేసిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణను నవంబర్‌ 7వ తేదీకి వాయిదా వేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande