మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అనిల్ రావిపూడి.. చిరంజీవి మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అమరావతి, 30 నవంబర్ (హి.స.) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’(mana Shankara Varaprasad gaaru). ‘సంక్రాంతి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి (Anil Ravipudi)తెరకెక
/anil-ravipudi-gives-good-news-to-mega-fans-interesting-comments-on-chiranjeevis-movie-499173


అమరావతి, 30 నవంబర్ (హి.స.)

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’(mana Shankara Varaprasad gaaru). ‘సంక్రాంతి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి (Anil Ravipudi)తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. షూటింగ్ దశలో ఉన్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఇందులో మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. విక్టరీ వెంకటేష్ ఓ స్పెషల్ రోల్ చేస్తున్నారు. అలాగే వీటీవీ గణేష్, కేథరిన్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోంచి విడుదలైన ‘మీసాల పిల్ల’ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేయడంతో పాటు టాప్‌లో కొనసాగుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్‌లోకి రాబోతుంది.

ఈనేపథ్యంలో.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ‘‘ఈ సంక్రాంతికి డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వబోతున్నాం. చిరంజీవిని మనం ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న పాత్రలో కనిపించనున్నారు. ఇది ఆయనకు ఎంతో నచ్చిన జానర్. ఈ మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయన ఈ జానర్‌తో రానున్నారు. గతంలో ఇలాంటి జానర్‌లో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఈ సినిమాతో చిరంజీవి అభిమానులను సర్‌ప్రైజ్ చేయబోతున్నారు. ‘మీసాల పిల్ల’ సాంగ్ మేము ఊహించని రెస్పాన్స్‌ను దక్కించుకుంది. త్వరలోనే ఇంకోపాటను కూడా విడుదల చేస్తాం.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande