ఎట్టకేలకు మంగోలియా నుంచి తిరిగొచ్చిన 228 మంది భారతీయులు.. ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీలో ల్యాండ్..
న్యూఢిల్లీ, 5 నవంబర్ (హి.స.) మంగోలియా రాజధాని ఈ ఉలాన్బాతర్లో చిక్కుకున్న 228 మంది భారత ప్రయాణికులు ఎట్టకేలకు సేఫ్ గా తిరిగొచ్చారు. బుధవారం ఉదయం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎయిర్ ఇండియా విమానం వారిని ఢిల్లీకి తీసుకువచ్చింది. ప్రయాణికులతో పాటు 17 మంద
ఎయిర్ ఇండియా


న్యూఢిల్లీ, 5 నవంబర్ (హి.స.)

మంగోలియా రాజధాని ఈ ఉలాన్బాతర్లో చిక్కుకున్న 228 మంది భారత ప్రయాణికులు ఎట్టకేలకు సేఫ్ గా తిరిగొచ్చారు. బుధవారం ఉదయం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎయిర్ ఇండియా విమానం వారిని ఢిల్లీకి తీసుకువచ్చింది. ప్రయాణికులతో పాటు 17 మంది సిబ్బందిని కూడా అదే విమానంలో భారత్కు తరలించారు. సాంకేతిక లోపం కారణంగా సోమవారం నాడు శాన్ఫ్రాన్సిస్కో–ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం మధ్యలోనే మంగోలియా రాజధానికి మళ్లించబడింది. దీంతో ప్రయాణికులు రెండు రోజుల పాటు ఉలాన్బాతర్లో నిలిచిపోయారు. పరిస్థితి తెలుసుకున్న ఎయిర్ ఇండియా అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, ప్రయాణికులందరినీ సురక్షితంగా భారత్కు తరలించారు. అధికారులు ఈ ఘటనపై సాంకేతిక లోపం కారణాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande