
డిల్లీ, 5 నవంబర్ (హి.స.)
వోట్ చోరీపై మరోసారి బిగ్ బాంబ్.
పేల్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో 25 లక్షలకుపైగా నకిలీ ఓట్లు చేర్చి ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. ఒక బ్రెజిలియన్ మోడల్ ఫోటోను 22 సార్లు వాడి సీమా, స్వీటీ, సరస్వతి పేర్లతో ఓటర్లుగా నమోదు చేశారని 'హెచ్ ఫైల్స్' పేరిట ఆధారాలు చూపిస్తూ బుధవారం ఎన్నికల సంఘం, భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ ల్యాండ్సైడ్ విజయం సూచించినా భాజపా గెలిచిందన్నారు. ఇందులో 5.21 లక్షల డూప్లికేట్ ఓట్లు, 93 వేల చెల్లని చిరునామాలు, 19 లక్షల బల్క్ ఓట్లు ఉన్నాయన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పేరిట భాజపాతో కుమ్మక్కై రిగ్గింగ్ జరిగిందని రాహుల్ ఆరోపించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..