
చెన్నై, 5 నవంబర్ (హి.స.)
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ చీఫ్, ప్రముఖ సినీ నటుడు దళపతి విజయ్ ని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పార్టీ ఉపాధ్యక్షుడు బుస్సీ ఆనంద్ మాట్లాడుతూ.. తమ నాయకుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని అన్నారు. ఆయన నేతృత్వంలోనే టీవీకే పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్. ఆనంద్, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..