
హైదరాబాద్, 6 నవంబర్ (హి.స.) మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. తుమ్మల నాగేశ్వర్ రావు ఓడిపోయి పామాయిల్ తోటలో ఉంటే.. కేసీఆర్ పిలిచి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు అని అన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావుతో కలిసి ఎమ్మెల్సీ తాతా మధు నేడు మీడియాతో మాట్లాడారు.
జూబ్లీహిల్స్ లో గెలవబోమని కాంగ్రెస్ కార్యకర్త మొదలు సీఎం వరకు అర్థమైంది. ఏం చేయాలో పాలుపోక మతం, కులం విషయంలో కింది స్థాయికి వెళ్లి రాజకీయం చేస్తున్నారు. మనిషికి ఓ కులాన్ని ఎత్తుకొని మంత్రులు కులపోరాటాలు చేస్తున్నారు. కులానికి, రాజకీయ పదవులకు సంబంధం లేదు. స్థాయిని పక్కన పెట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం రాజకీయం చేయడం తుమ్మల నాగేశ్వర్ రావుకు తగదన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..