సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల ప్రధానాధికారికి బీఆర్ఎస్ ఫిర్యాదు
హైదరాబాద్, 6 నవంబర్ (హి.స.) బీఆర్కే భవన్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, మహ్మద్ షకీల్, బీఆర్ఎస్ నేతలు పల్లె రవికుమార్, కిశోర్ గౌడ్, సల్మాన్గాఖాన్ తో
బిఆర్ఎస్ ఫిర్యాదు


హైదరాబాద్, 6 నవంబర్ (హి.స.)

బీఆర్కే భవన్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, మహ్మద్ షకీల్, బీఆర్ఎస్ నేతలు పల్లె రవికుమార్, కిశోర్ గౌడ్, సల్మాన్గాఖాన్ తో పాటు ఇతర బీఆర్ఎస్ మైనార్టీ నేతలు కలిశారు.

ఈ సందర్భంగా ముస్లింలపై జరుగుతున్న దాడులు, ముస్లింలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల ప్రధానాధికారికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. తక్షణమే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డిని కోరారు. ముస్లింలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఈవో సుదర్శన్ రెడ్డికి వేర్వేరుగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు, మైనార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande