
న్యూఢిల్లీ, 6 నవంబర్ (హి.స.)
హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బ్రెజిల్ మోడల్(Brazilian Model) ఓటేసినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ మోడల్ పేరుతో 22 ఓట్లు ఉన్నాయని ఆయన బుధవారం మీడియా ముందు ఆరోపించారు. అయితే ఆ మోడల్ ఎవరన్నది తెలిసింది. ఆమెను లారిసా నేరిగా గుర్తించారు. ప్రెస్కాన్ఫరెన్స్లో రాహుల్ గాంధీ వాడిన తన ఫోటో గురించి ఆ మోడల్ స్పందించింది. తాను 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆ ఫోటో దిగినట్లు ఆమె చెప్పింది. ఆ మోడల్ దీనిపై ఓ వీడియోను కూడా రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది.
తనకు చెందిన ఓ పాత ఫోటోను వాడారని, 20 ఏళ్ల వయసులో ఆ ఫోటో దిగానని, ఇండియాలో ఓటింగ్ కోసం వాడినట్లు తెలిసిందని, ప్రజల్ని మోసం చేసేందుకు తనను ఇండియన్గా చూపిస్తున్నారని, ఇదేం వెర్రితనం, ఇంత పిచ్చా, మనం ఏం ప్రపంచంలో జీవిస్తున్నాని ఆ మహిళ తన వీడియోలో పేర్కొన్నది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..