
అమరావతి, 6 నవంబర్ (హి.స.)సీపీఐ నూతన కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకున్నారు. బుధవారం విజయవాడలో పి.రామచంద్రయ్య అధ్యక్షతన జరిగిన రాష్ట్ర సమితి సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్యతోపాటు జేవీ సత్యనారాయణమూర్తి, పీ హరనాథరెడ్డి, కేవీవీ ప్రసాద్, డీ జగదీశ్, జంగాల అజయ్ కుమార్, డేగ ప్రభాకర్, తాటిపాక మధు, పి.దుర్గాభవాని, కె.రామాంజనేయులు, శాశ్వత ఆహ్వానితులుగా ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజలు కార్యదర్శివర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ